ఉమాభారతికి ఆహ్వానం అందింది. కానీ..అద్వానీ, జోషికి..?

ఆగస్టు5న జరగనున్న రామమందిర భూమిపూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మందికి అయోధ్య ట్రస్ట్ ఆహ్వానాలు పంపించింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి కూడా ఆహ్వానం అందింది. అయితే, బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషికి మాత్రం ట్రస్టు ఇప్పటి వరకూ ఆహ్వానాలు పంపలేదు. కాగా.. 1992లో మజీద్ కూల్చివేతలో ప్రధాన నిందితులుగా ఉమా భారతి, ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఉన్నారు. వీరిలో ఉమాభారతికి ఆహ్వానం పంపించిన ట్రస్ట్.. అద్వానీ, మనోహర్ జోషికి పంపిచకపోవడం చర్చనీయాంశం. అయితే, ఇంకా భూమిపూజకు సమయం ఉంది కనుక, వారికి కూడా ఆహ్వానాలు అందుతాయి ఏమో చూడాలి. కాగా.. కరోనా నేపథ్యంలో భూమి పూజ కార్యక్రమం 200 మందితో మాత్రమే నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Tags

Next Story