జమ్మూ కాశ్మీర్‌ రాజౌరి సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పులు

నియంత్రణరేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నా.. పదే పదే పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై శనివారం పాకిస్తాన్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో భారత సైనికుడు అమరవీరుడయ్యారు. అయితే దీనికి భారత సైన్యం కూడా ధీటైన సమాధానం ఇచ్చింది. ఇక అధికారిక గణాంకాల ప్రకారం, పాకిస్తాన్ ఈ ఏడాది 2700 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలను చేసింది. ఈ సంఖ్య గత సంవత్సరం 3168, 2018 లో 1629 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. ఈ సమయంలో 21 మంది పౌరులు మరణించగా, 94 మంది గాయపడ్డారు.

Tags

Next Story