క‌ల్తీ మ‌ద్యం సేవించి 21 మంది మృతి

క‌ల్తీ మ‌ద్యం సేవించి 21 మంది మృతి
X

పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మ‌ద్యం తాగి 21 మంది మరణించారు. రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అమృత్‌స‌ర్‌, గురుదాస్‌పూర్‌, తార‌న్ త‌ర‌న్ ప్రాంతాల్లో ఈ మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో మ‌రికొంద‌రు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. కాగా, ఈ ఘ‌ట‌న‌ల‌పై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. ఆ ఘ‌ట‌న‌ల‌పై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

Tags

Next Story