చైనా, రష్యా వ్యాక్సిన్లా.. అస్సలొద్దు: ఫౌచి

చైనా, రష్యా వ్యాక్సిన్లా.. అస్సలొద్దు: ఫౌచి

కొవిడ్ ని కంట్రోల్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 17 ఫార్మా సంస్థలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. కొన్ని దేశాల వ్యాక్సిన్ తయారీలో తుది రూపుదాల్చాయి. అయితే చైనా, రష్యా రూపొందిస్తున్న వ్యాక్సిన్లు సురక్షితం కాదని అమెరికా అభిప్రాయపడుతోంది. ఈ దేశాల నుంచి వస్తున్న వ్యాక్సిన్ల ట్రయిల్స్ విస్తృతంగా జరగలేదని, అందుకే ఇవి ప్రమాదమని భావిస్తోంది. పారదర్శకంగా లేని పశ్చిమ దేశాల టీకాలను తాము వాడడం కష్టమని అమెరికా అంటు వ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోని ఫౌచీ అన్నారు. వ్యాక్సిన్ ఇతరులకు విక్రయించే ముందు విస్తృతంగా పరిశోధనలు జరగాలి. కానీ అలా జరగలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వ్యాక్సిన్లు వస్తే పరిస్థితి మరింత జటిలం అవుతుందని ఫౌచి మీడియా సమావేశంలో అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story