చైనాలో మరోసారి కొత్త కరోనా కేసులు నమోదు..

చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. నాలుగు నెలల కిందట వైరస్ తీవ్రత తగ్గిన చైనాలో మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో చైనాలో 45 కొత్త కేసులు నమోదయ్యాయి . ఇందులో 39 మంది స్థానికులు ఉండగా. మరో ఆరుగురు ట్రావెల్ హిస్టరీ వున్నవారు ఉన్నారు.చైనా ఆరోగ్య కమిషన్ నివేదిక ప్రకారం జిన్జియాంగ్ నుండి 31, లియోనింగ్ రాష్ట్రంలో 8 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఇక్కడ ఒక్క సంక్రమణ మరణం నమోదు కాలేదు. కాగా చైనాలో గురువారం కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 112 జిన్జియాంగ్ నుండి ఉద్భవించాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
