రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ ఇకలేరు

X
రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ (64) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సమస్య కారణంగా దాదాపు ఆరునెలలు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కాగా అమర్‌సింగ్ 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్.. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో చివరి సారిగా రాజ్యసభకు సమాజ్ వాది పార్టీ నుంచి నామినేట్ అయ్యారు. అమర్‌సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
