ఉత్తరప్రదేశ్ మంత్రి కమల్ రాణి కరోనాతో మృతి

దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్ కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. సామన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ మహమ్మారి ఎవరినీ విడిచిపెట్టడం లేదు. తాజగా ఉత్తరప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమల్ రాణి దేవి కరోనాతో మృతిచెందారు. గత కొంతకాలంగా కరోనా చికిత్స పొందుతున్న కమల్ రాణి ఆదివారం ఉదయం కన్నుమూశారు.
జూలై 18న ఆమె కరోనా బారినపడ్డారు. దీంతో అప్పటి నుంచి సంజయ్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు సర్కార్ ప్రకటించింది. కమల్ రాణి కాన్పూర్‌లోని ఘటంపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినథ్యం వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com