యడియూరప్ప కుమార్తెకు కరోనా

యడియూరప్ప కుమార్తెకు కరోనా
X

కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన కుమార్తెకు కరోనావైరస్ పరీక్ష చేయగా పాజిటివ్ అని వచ్చింది. దాంతో ఆమెను బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు. బిఎస్ యడియూరప్ప ఆదివారం అదే ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. కాగా భారతదేశంలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా 18 లక్షలకు చేరుకుంది.. మరణాల సంఖ్య ఇప్పటికే 37,000 దాటింది.

Tags

Next Story