11 మందితో ఏఎంఆర్‌డీఏ అట..

ఐదుకోట్ల ప్రజానీకం మూడు రాజధానులు వద్దు, crda ను రద్దు చేయవద్దు అని నెత్తినోరు బాదుకున్నా బలవంతంగా ప్రజలపై మూడు రాజధానులు రుద్దారు ఏపీ ప్రభుత్వ పెద్దలు.
చంద్రబాబు మీద కోపంతో కలల రాజధాని అమరావతిని నాశనం చేశారు. ప్రజల నోటికాడి కూడు లాగేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నిపుణులు, హిందుత్వ వాదులు ఎంత మొత్తుకున్నా వినలేదు. ఒకవైపు రాజధానిలో అమరావతి కోసం ఉద్యమం కొనసాగుతూనే ఉంది. మరోవైపు అమరావతిలో ఏపీసీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొత్తం 11 మందితో కమిటీని నియమించింది. అయితే ఇంకా చైర్మన్ ను మాత్రం నియమించలేదు. సభ్యులుగా..
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి – డిప్యూటీ చైర్‌పర్సన్
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి – సభ్యుడు
ఏఎంఆర్‌డీఏ కమిషనర్ –సభ్య కన్వీనర్
గుంటూరు జిల్లా కలెక్టర్ –సభ్యుడు
కృష్ణా జిల్లా కలెక్టర్ – సభ్యుడు
రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (గుంటూరు) –సభ్యుడు
రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (విజయవాడ) –సభ్యుడు
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ –సభ్యుడు
రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ –సభ్యుడు
ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ –సభ్యుడు
ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ –సభ్యుడు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com