ఇది శ్రీరాముడి నిర్ణయం.. అందుకే నాకు.. : ముస్లిం సోదరుడి హర్షం

ఇది శ్రీరాముడి నిర్ణయం.. అందుకే నాకు.. : ముస్లిం సోదరుడి హర్షం
X

అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమి పూజను ఆగస్ట్ 5న నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమానికి కొవిడ్ వ్యాప్తి కారణంగా మొదట 200 మంది అతిథులను పిలవాలనుకున్నా దాన్ని మళ్లీ తగ్గించి 180 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. భూమి పూజకోసం ఆహ్వానించే ప్రత్యేక అతిధులలో బాబ్రీ మసీదు కోసం న్యాయ పోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి తొలి ఆహ్వానం అందింది. రామ మందిర నిర్మాణంపై ముస్లింల తరపున బలంగా గళం వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. కాగా భూమి పూజకోసం తనను ఆహ్వానించడం పట్ల అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తు ఆ శ్రీరాముని నిర్ణయం. అందుకే దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను అని ఆయన అన్నారు. కాషాయం రంగులో ముద్రించిన ఆహ్వానపత్రికలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరుల పేర్లు ముద్రించి ఉన్నాయి.

Tags

Next Story