బాబోయ్ అంత డబ్బే.. అయినా నేను చెయ్యను: పూనం కౌర్

బాబోయ్ అంత డబ్బే.. అయినా నేను చెయ్యను: పూనం కౌర్

బిగ్‌బాస్ కదా కరోనా భయం అస్సలు లేదు. అందుకే నాలుగో సీజన్ కి రెడీ అయిపోతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే షో ప్రారంభించనున్నామని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఈ సీజన్ కి హోస్ట్ నాగార్జున అని ప్రోమోలు చెబుతున్నాయి. అయితే హౌస్ లో ఎవరెవరు ఉంటారనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. రోజుకొకరి పేరైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో తరుణ్, హీరోయిన్లు శ్రద్ధాదాస్, హంసానందిని, యూట్యూబర్ సునయన, యాంకర్ విష్ణు ప్రియ పేర్లు మాత్రం వైరల్ అవుతున్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువగా వార్తల్లో వుండే మరో వ్యక్తి.. హీరోయిన్ పూనమ్ కౌర్ ఈమెను బిగ్‌బాస్ టీమ్ సంప్రదించారట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. పారితోషికం ఊరించినా కరోనా భయపెడుతుందో ఏమో.. పూనమ్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. కరోనా సీజన్ లో బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించట్లేదు. మరి నిర్వాహకులు షోని ఎలా రన్ చేస్తారో చూడాలి. జూన్ లో ప్రారంభం కావాల్సిన సీజన్ వాయిదా పడుతూ చివరికి ధైర్యం చేసి ముందడుగు వేస్తోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా షోని సక్సెస్ ఫుల్ గా రన్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story