ఎమ్మెల్యేల జీతాల్లో 30 శాతం కోత..

ఎమ్మెల్యేల జీతాల్లో 30 శాతం కోత..
X

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నివాసంలో కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలతో పాటు, కరోనాతో సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రానికి ఆర్ధిక క్రమశిక్షణ అవసరమని క్యాబినెట్ అభిప్రాయపడింది. దాంతో ఎమ్మెల్యేల జీతం ఒక సంవత్సరంపాటు 30 శాతం తగ్గించాలని నిర్ణయించారు.

దీనిపై రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలతో మాట్లాడకుండా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష రాష్ట్ర నాయకుడు ఇందిరా హృదయేష్ విమర్శించారు. ఎమ్మెల్యేల జీతం కోత మంత్రివర్గ నిర్ణయంతో కాకుండా వారి సమ్మతితో ఉండాలి అని అన్నారు. ముఖ్యమంత్రి తమతో మాట్లాడితే, ఈ తగ్గింపును తిరస్కరించము. మమ్మల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇలా చేయడం ఏమాత్రం తగదని అన్నారు.

Tags

Next Story