2021 చివరి నాటికి సొంత కరోనా వ్యాక్సిన్ : అదార్ పూనావాలా

2021 చివరి నాటికి  సొంత కరోనా వ్యాక్సిన్ : అదార్ పూనావాలా
X

కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీపై సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ డ్రగ్ కంట్రోలర్ నుండి 3 వ దశ మానవ ట్రయల్ అనుమతి కోరుతున్నామని, 2021 ముగింపు లోపు తమ సొంత వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సీరం ఇన్స్టిట్యూట్.. ఆక్స్ ఫర్డ్ సహకారంతో టీకాలు తయారు చేస్తోందని

అన్నారు. పూణేలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థగా ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్‌ను మిలియన్ల మోతాదులో తయారు చేయబోతోందని ఆయన అన్నారు.. ఈ టీకా పనిచేస్తే, కంపెనీ సీఈఓ పూనవాలా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అవుతారు.

Tags

Next Story