ఫేప్‌బుక్‌పై టిక్‌టాక్ సంచలన ఆరోపణలు

ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్ నిషేధం ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఫేస్‌బుక్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఫేస్‌బుక్ టిక్‌టాక్‌ను కాపీ కొట్టిందని, తమను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసిందని మండిపడింది. తమ సంస్థను ప్రపంచ స్థాయి కంపెనీగా తీర్చిదిద్దేందకు తీవ్రంగా కృషి చేస్తున్నామని.. దీనికి కట్టుబడి ఉన్నామని.. బైట్ డ్యాన్స్ తెలిపింది. అయితే, ఎదిగే క్రమంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోవలసి వస్తుందని.. ఇలా పరిస్థితిని తాము ఊహించలేదని తెలిపింది. తమ ప్రత్యర్థి అయిన ఫేస్‌బుక్ తమను కాపీ కొట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది. అయితే, ఏ విషయంలో కాపీ కొట్టారు అనే విషయాన్ని తెలియజేయలేదు. టిక్‌టాక్ కోనుగులుపై చర్చలకు కట్టుబడి ఉన్నామన్న మైక్రోసాఫ్ట్ స్టేట్‌మెంట్‌కు కొద్ది సేపటి ముందు..బైట్‌డ్యాన్స్ చైనా భాషలో ఈ ప్రకటన విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com