అయోధ్య భూమి పూజకు ఆటంకాలు.. అయిదు వివాదాలు

అయోధ్యలో రామాలయ నిర్మాణం.. ఏనాటి ఈ కలయో ఇన్నాళ్టికి నెరవేరబోతోంది. ఇంతటి మహత్కార్యానికి కనులారా చూసి ఆనందించాల్సిన సమయంలో కరోనా భయపెడుతోంది. ఓవైపు ఈ మహావేడుకను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతుంటే.. మరోవైపు వివాదాలు ముసురుకుంటున్నాయి. మతపరమైన కార్యక్రమాలకు ప్రధాని ఎలా హాజరవుతాయని విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. అయినా ఓ పక్క కరోనా వణికిస్తుంటే ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం ఏమిటని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్, ఎంఐఎంలు.
ప్రధాని రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అధికారిక హోదాలో భూమి పూజకు హాజరవడం రాజ్యాంగ విరుద్ధం అని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వాదాన్ని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తిప్పికొట్టారు. రాష్ట్రపతి, ప్రధాని హోదాల్లో ఉన్న వారికి ఇఫ్తార్ విందులు ఇచ్చినప్పుడు లౌకికవాదం ఏమైందని ప్రశ్నించారు. గతంలో సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, ఉప ప్రధాని సర్ధార్ పటేల్ హాజరయ్యారు. మతపరమైన కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ ఆనాటి ప్రధాని నెహ్రూ వెళ్లలేదు.
కరోనా వేళ భూమిపూజ నిర్వహించడాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తప్పుబట్టారు. శ్రీరాముడు దశరథుడి కుమారుడు మాత్రమే కాదని ఆయనంటే అందరికీ విశ్వాసం ఉందని ఆర్జేడీ నేత మనోజ్ ఝూ వ్యాఖ్యానించారు. అన్ని ప్రధాన పార్టీల నేతలను భూమి పూజకు ఆహ్వానించి ఉండాల్సిందని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించిన ఒవైసికి ప్రధానికంటే పెద్ద హోదాలో ఉన్న రాష్ట్రపతిని ఆహ్వానించరని.. ఆ కార్యక్రమానికి ప్రధాని ప్రధాన అతిధిగా ఉన్నారని వివరణ ఇచ్చారు.
ఇక 5వ తేదీ మధ్యాహ్నం 12.15.15 గంటల నుంచి 1.215.47 గంటలలోపు భూమి పూజ చేయాలని కాశీలోని సుప్రసిద్ధ జ్యోతిష్య శాస్త్రవేత్త ఆచార్య గణేశ్వర్ రాజ్ ముహుర్తం నిర్ణయించారు. అయితే ద్వారకా శంకరాచార్య స్వామి సంపూర్ణానంద సరస్వతి ఈ ముహూర్తంతో విభేధించారు. శంకుస్థాపన తేదీ శుభప్రదమైనది కాదన్నారు. ఆగస్టు 5 చాతుర్మాస్య దీక్ష సమయం వస్తుందని ఈ సమయంలో పూజలు నిర్వహించరాదని మరికొందరి వాదన. ఇన్నాళ్లు తాత్కాలిక ఆలయంలో ఉన్న రామ్ లల్లా విగ్రహం బదలు విల్లమ్ములు ధరించిన శ్రీరామచంద్రుడిని ప్రతిష్టించాలని ట్రస్టు సంకల్పించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com