హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సీఈఓకు ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త MD &CEO శశిధర్ జగదీషన్ నియామకానికి ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత MD ఆదిత్య పురి అక్టోబర్ 26న పదవీ విరమణ చేయనున్నారు. అక్టోబర్ 26తో ఆదిత్య పురి వయస్సు 70 దాటుతుందని, ప్రైవేట్ బ్యాంక్ చీఫ్‌లకు సంబంధించి రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేయనున్నట్టు గత ఏడాదే ఆయన క్లారిటీ ఇచ్చారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త బాస్ కోసం బ్యాంక్ బోర్డు తీవ్ర కసరత్తు చేసింది. ఛైర్మన్ దీపక్ పారేఖ్ సారధ్యంలో కొత్త MD&CEO అన్వేషణ కమిటీ మొత్తం ముగ్గురి ప్రొఫైల్‌ను(శశిధర్ జగదీషన్, ఖైజాద్ భారూచా, సునీల్ గార్గ్) పరిశీలించిన బోర్డు శశిధర్ జగదీషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
శశిధర్ జగదీషన్‌కు బ్యాంక్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఫైనాన్స్, హ్యూమన్ రీసోర్స్, లీగల్ అండ్ సెక్రటేరీయల్, అడ్మిన్, ఇన్ ఫ్రా, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగాల్లో హెడ్‌గా పనిచేసిన అనుభవం శశిధర్ జగదీషన్‌కు ఉంది. 1996లో మేనేజర్‌గా కంపెనీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శశిధర్ 1999లో ఫైనాన్స్ హెడ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 2008లో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ అయ్యారు. ప్రస్తుతం కంపెనీలో కీలక వ్యక్తిగా మారారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com