జైలుపై ఇస్లామిక్ స్టేట్ దాడి.. 29 మంది మృతి

X
జైలుపై ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దాడికి పాల్పడింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఉన్న ఓ జైలులో ఈ దాడి జరిగింది. దాదాపు గంటసేపు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 29 మంది మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మరణించిన 29 మందిలో పౌరులు, ఖైదీలు, గార్డులు, ఆఫ్ఘన్ భద్రతా దళాలు ఉన్నట్లు ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అట్టౌల్లా ఖోగ్యాని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దళం పేలుడు పదార్థాలతో నిండిన కారును జైలు ప్రధాన ద్వారం వరకు నడుపుకుంటూ వచ్చి బాంబు పేల్చడంతో ఈ దాడి జరిగింది. జైలు గార్డులపై కాల్పులు జరిపారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో రెండు మిలిటెంట్ వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోయాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
