ఓఎల్ఎక్స్‌లో మిగ్-23 యుద్ధ విమానం

ఓఎల్ఎక్స్‌లో మిగ్-23 యుద్ధ విమానం
X

అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలోని మిగ్-23 యుద్ధ విమానాన్ని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టడం కలకలం రేపింది. ఈ విమానాన్ని రూ.9.99 కోట్లకు అమ్మకానికి పెట్టారు. అయితే, ఈ విషయంపై యూనివర్శిటీ అధికారులను సంప్రదించగా.. వారు దాన్ని ఖండించారు. అది ఒక తప్పుడు ప్రకటన అని.. అలాంటి ప్రకటన యూనివర్శిటి చేయలేదని తెలిపారు. తమను అప్రతిస్టపాలు చేసేందుకే ఎవరో కావాలని చేశారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. కాగా.. సదరు మిగ్-23 విమానాన్ని ఎయిర్‌ఫోర్స్ 2009లో ఏఎమ్‌యూకు బహుమతిగా ఇచ్చింది. ప్రస్తుతం యూనివర్శటీ ప్రాంగణంలో ఉన్న ఈ విమానం చూపరులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

Tags

Next Story