స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు

By - TV5 Telugu |4 Aug 2020 9:40 PM IST
విజయవాడలో ఓ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గొల్లపూడిలోని నల్లకుంటలో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు పట్ల బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మానవమృగాలకు తగిన గుణపాఠం చెప్పేలా ఈ తీర్పు ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణరెడ్డి అన్నారు. కాగా 2019లో పెంటయ్య అనే వ్యక్తి ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, తనను హతమార్చాడు. అమానుష ఘటనకు సంబంధించిన కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం పెంటయ్యను దోషిగా తేల్చి మంగళవారం ఉరిశిక్ష ఖరారు చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com