తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్

వైసీపీ నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్వయం ఆయనే సెల్పీ వీడియో ద్వారా తెలియజేశాడు. అభిమానులు ఆశీర్వాదం, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం త‌న‌కి కావాల‌ని కోరారు. పృథ్వీరాజ్ గత పది రోజుల నుంచి జ‌లుబుతో బాధ‌ప‌డుతున్నారు. అయితే, కరోనా పరీక్షలు రెండు సార్లు చేసినా.. నెగెటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. నెగెటివ్ వచ్చినా..15 రోజులు క్వారంటైన్‌లో ఉండాల‌ని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రితో చేరానని వీడియో ద్వారా తెలియ‌జేశారు పృథ్వీరాజ్. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పేరుతో తెలుగు ప్రేక్షకులుకు సుపరిచితులైన పృథ్వీరాజ్.. న‌టుడిగా బిజీగానే ఉంటూ.. రాజకీయాల్లో చేరారు. కాగా.. ఆయన కొంత కాలం ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story