రష్యా పరిశోధనలో తేలిన నిజం.. వేడి నీళ్లు వైరస్‌ను..

రష్యా పరిశోధనలో తేలిన నిజం.. వేడి నీళ్లు వైరస్‌ను..

కరోనాకి ట్రీట్ మెంట్ ఏదీ అంటే కచ్చితంగా ఏ డాక్లరూ చెప్పలేని పరిస్థితి. అందుబాలో ఉన్న కొన్ని ఔషధాలతో రోగులను కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు వైద్యులు. రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీలైనంత వరకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి వారు. కరోనా వైరస్ ని నిర్మూలించేందుకు వేడి నీళ్లు తాగితే మంచిదని రష్యా పరిశోధకులు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 160 పరిశోధక బృందాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఈ సందర్భంగా రష్యా పరిశోధకులు వేడి నీరు వైరస్ వీక్ స్పాట్ అని చెబుతున్నారు. ఈ నీరు వైరస్ ను బలహీన పరుస్తుందని తెలిపారు.

రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో అనారోగ్యాలనుంచి దూరంగా ఉండొచ్చని పెద్దలు చెబుతున్న మాట ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ కరోనా సీజన్ లో అది మరింత విస్తృతమైంది. జలుబు, దగ్గుకు వేడినీళ్లు ఔషధంలా పనిచేస్తాయి.

రష్యా పరిశోధన శాల.. వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ బృందం.. వేడి నీరు వైరస్ పెరుగుదలను అరికడుతుందని తెలిపారు. 90 శాతం వైరస్ చనిపోవడానికి 24 గంటలు పడుతుందని పేర్కొన్నారు. 99.9 శాతం వైరస్ చనిపోవడానికి 72 గంటల సమయం పడుతుందన్నారు. అలాగే సముద్రపు జలాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కాదన్నారు. నీటి ఉష్ణోగ్రతల ఆధారంగా వైరస్ నీటిలో ఎంతసేపు జీవిస్తుందనేది చెప్పగలమని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story