కరోనా భారిన పడిన మరో కేంద్ర మంత్రి

కరోనా భారిన పడిన మరో కేంద్ర మంత్రి
X

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరువాత, మరో కేంద్ర మంత్రి కరోనా భారిన పడ్డారు.. కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మరియు ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన గురుగ్రామ్ లోని మెదంత ఆసుపత్రిలో చేరారు, అక్కడ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 29న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో..

అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌ , రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. 51 ఏళ్ల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కోవిడ్ -19 కు పాజిటివ్ గా పరీక్షించిన రెండవ కేంద్ర మంత్రి. ఇక సీఎంలలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక ముఖ్యమంతి బిఎస్ యెడియరప్ప, కర్ణాటక మాజీ సిఎం సిద్ధరామయ్య కరోనా భారిన పడ్డారు. తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ కూడా కరోనా సంక్రమణకు గురయ్యారు.

Tags

Next Story