అమరావతిలో మార్మోగుతోన్న రాజధాని నినాదం

X
అమరావతిలో రాజధాని నినాదం మార్మోగుతోంది. ఇప్పటికే 232 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు రైతులు. రాజధాని కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో రైతుల్లో మరింత నమ్మకం పెరిగింది. తమకు ఎలాగైనా న్యాయస్థానం న్యాయం చేస్తుందనే నమ్మకంగా ఉన్నారు.
ఆరునూరైనా సరే అమరావతి తరలిపోతుంటే మాత్రం చూస్తూ ఊరుకోమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మూడు రాజధానులపై రాష్ట్ర హైకోర్టు ఈ నెల 14 వరకూ ఇచ్చిన యథాతథ స్టేట్సకో తొలి విజయమని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. కాస్త ఆలస్యమైనా అంతిమ విజయం అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలదేనని ఆయన చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
