అమ్మో.. అమ్మాయేనా.. ఆ నడుమేంటి అంత నాజూగ్గా..

అమ్మాయిల నడుము నాజూగ్గా ఉంటే అందమే కానీ.. మరీ ఇంత నాజూగ్గా ఉంటే నిజమేనా అని ఆశ్చర్యం కలగక మానదు. ప్రపంచంలోనే అతి చిన్న నడుము ఉన్న చిన్నదానిగా ప్రసిద్దికెక్కింది మయన్మార్ కు చెందిన విద్యార్థి సు నాయింగ్. ఆమె నడుము కేవలం 13.7 అంగుళాల చుట్టుకొలత కలిగి ఉంది. 23 ఏళ్ల సు తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఆమె తన ఫొటోలను ఎడిట్ చేసి ఉంటుందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే నడుము దగ్గర ఉన్న పక్కటెముకలను తొలగించిందేమో ఒకింత సందేహాన్నీ వ్యక్తం చేశారు. కానీ సు తనని తాను సమర్థించుకుంది.
ఆమె తన ఫోటోలను మార్ఫింగ్ చేయలేదని, అది తన ఒరిజినల్ నడుమేనని తెలిపింది. పైగా అన్నీ తింటూ ఆరోగ్యంగా ఉంటానని సందేహాలను నివృత్తి చేసింది. 'నేను ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నాను, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను కాబట్టి ఆందోళన చెందడానికి ఏమీ లేదు. నేను ఫోటోల్లో ఎలా కనిపిస్తున్నానో అలానే ఉంటాను అని చెప్పుకొచ్చింది సు. ఇదిలా ఉంటే..ప్రపంచంలోని అతి చిన్న నడుము ఉన్న ప్రస్తుత గిన్నిస్ రికార్డ్ హోల్డర్ UK కి చెందిన ఎథెల్ గ్రాంజెర్. ఈమె నడుము 13 అంగుళాలు ఉంటుంది. అదేవిధంగా చిన్న నడుము ఉన్న ఇతర మహిళలు నాజూకైన నడుము కోసం పక్కటెముకలు తొలగించినట్లు అంగీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com