వాటర్ బాటిల్ కంటే తక్కువ రేటుకు వ్యాక్సిన్ అందిస్తాం : భారత్ బయోటెక్

వాటర్ బాటిల్ కంటే తక్కువ రేటుకు వ్యాక్సిన్ అందిస్తాం : భారత్ బయోటెక్
X

కరోనా వ్యాక్సిన్ తయారీలో భారతీయ కంపెనీలు స్పీడు పెంచాయి. మొత్తం 3 సంస్థలు వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్నాయి. ఇందులో భారత్ బయోటెక్, జైడస్ కాడిలా కంపెనీలు తొలిదశ క్లీనికల్ ట్రయల్స్ కూడా పూర్తిచేసినట్టు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ దేశవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఫేజ్ స్టడీ పూర్తి చేసింది. రెండో దశ క్లీనికల్ ట్రయల్స్ చేయడానికి రెడీ అవుతోంది. పూనేకు చెందిన మరో కంపెనీ జైడస్ కాడిలా కూడా 11 ప్రాంతాల్లో ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ పూర్తిచేసింది. సెకండ్ ఫేజ్ మరో 11 ప్రాంతాల్లో చేసేందుకు ICMR అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అతితక్కువ సమయంలోనే ట్రయల్స్ ప్రక్రియ పూర్తిచేస్తోంది. ఏప్రిల్ లో హ్యూమన్ ట్రయల్స్ చేసిన యూకే చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఆలస్యంగా పరిశోధనలు మొదలుపెట్టినా.. ఇండియన్ కంపెనీలు తక్కువ సమయంలోనే ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇండియన్ కంపెనీస్ అమెరికా మోడర్నా, ఆక్స్ ఫర్డ్ వర్శిటీలతో పోటీపడుతున్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ సాధ్యమైనంత త్వరగా తీసుకొస్తామని కంపెనీ ఎండీ క్రిష్ణా ఎల్లా ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన వెబినార్ లో ఆయన ప్రకటన చేశారు. అంతేకాదు.. వాటర్ బాటిల్ ఖర్చు కంటే తక్కువ రేటుకు వ్యాక్సిన్ అందిస్తామంటూ మంత్రి కేటీఆర్ తో అన్నారు. ట్రయల్స్ సమయంలో రాజీపడుతున్నా.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేదంటున్నాయి కంపెనీలు.

Tags

Next Story