భద్రతా దళాలు, నక్సలైట్‌ల మధ్య కాల్పులు

భద్రతా దళాలు, నక్సలైట్‌ల మధ్య కాల్పులు

ఛత్తీస్‌గడ్ ‌లోని బీజాపూర్‌లో బుధవారం భద్రతా దళాలు, నక్సలైట్‌ల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో మహిళా నక్సలైట్ ఒకరు మరణించారు. ఘటనా స్థలం నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ 12 బోర్ గన్, గుళికలు, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు, గుడారాలు, పెద్ద మొత్తంలో రోజువారీ వినియోగ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సంఘటన గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని ఎస్పీ కమల్ లోచన్ కశ్యప్ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు.

Tags

Read MoreRead Less
Next Story