బీరూట్‌లో రెండు భారీ పేలుళ్లు

X
లెబనాన్ రాజధాని బీరూట్‌లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల ఘటనలో డజన్ల మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అనేక దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి.పేలుళ్లదాటికి భయపడిన జనం ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల భూమి కంపించింది. పేలుడు శబ్దాలు 250 కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్టు ప్రత్యక్షసాక్షులు ట్విట్టర్లో పేర్కొన్నారు. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పుడే చెప్పలేమన్నారు అధికారులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
