భూమిపూజ చూశాకే దీక్ష విరమణ.. 28 ఏళ్లుగా అన్నం ముట్టని ఊర్మిళ

భూమిపూజ చూశాకే దీక్ష విరమణ.. 28 ఏళ్లుగా అన్నం ముట్టని ఊర్మిళ
X

ఆ రామయ్య తండ్రికి అయోధ్యలో దేవాలయం లేదు. రామాలయ నిర్మాణం చేపట్టే వరకు అన్నం తినను అని మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌కు చెందిన ఒక మహిళ దీక్ష చేపట్టింది. ఆమె చేపట్టిన దీక్షఫలించి ఆగస్టు 5న ఆలయన నిర్మాణానికి భూమి పూజ జరుగుతోంది. 1992లో అయోధ్యలో అల్లర్లు చెలరేగిన సమయంలో 53 ఏళ్ల ఊర్మిళా చతుర్వేది తీవ్రంగా కలత చెందారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగేవరకు అన్నం తినని ప్రతిజ్ఞ చేశారు. కుటుంబసభ్యులు పలు మార్లు అన్నం తినమని బలవంతపెట్టినా ఆమె వారి మాట వినలేదు. పండ్లు మాత్రమే తింటూ, ఇంట్లో ఏర్పాటు చేసుకున్న రామదర్బార్ లో రామనామ జపం చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈనెల 5న భూమి పూజను ప్రత్యక్ష ప్రసారంలో చూసిన అనంతరం దీక్షను విరమిస్తానని ఊర్మిళ తెలిపారు.

Tags

Next Story