తిరుపతిలో మరికొన్ని రోజులు లాక్‌డౌన్

X
By - TV5 Telugu |5 Aug 2020 10:10 PM IST
కరోనా కేసులు పెరుగుతుండడంతో తిరుపతిలో.. లాక్ డౌన్ ను మరికొంతకాలం పొడిగిస్తున్నట్టు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరిష తెలిపారు. మంగళవారం నుంచి మరో పది రోజులు.. అంటే ఈ నెల 14 వరకు లాక్‌డౌన్ ఉండనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నిన్నటిదాకా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అవసరమైన షాపులకు అనుమతి ఉండేదని ఇక నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుంటే కరోనా లక్షణాలు లేని వారు పరీక్షలకు రావోద్దని అధికారులు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com