అయోధ్య చరిత్రలో నేడు సువర్ణాధ్యాయం : ప్రధాని మోదీ
చరిత్రలో రాముడిని మించిన రాజు లేడని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ సందర్బంగా మాట్లాడిన ప్రధాని.. మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. రామాలయ నిర్మాణంలో భాగంగా భూమి పూజకు నన్ను ఆహ్వానించినందుకు రామ్ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మోదీ అన్నారు. ఈ రోజుకోసమే కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆశతో ఎదురుచూశారని అన్నారు. ఇన్నేళ్లు గుడిసె లాంటి ఆలయంలో ఉన్న రాముడికి ఇకపై ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం. అయోధ్య చరిత్రలో నేడు ఒక సువర్ణ అధ్యాయం. ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. అయోధ్యలోని రామాలయ పునాది వేడుకలకు గుర్తుగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు వెండి ఇటుకను ఇచ్చారు.
కాగా ఈ కార్యక్రమంలో వేదిక మీద 175 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాల్‌దాస్ మహారాజ్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సిఎం యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖులు ఈ అపూరూప ఘట్టంలో పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని , సామాజిక దూర సూత్రాలకు అనుగుణంగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. దీనికి ముందు ప్రధానమంత్రి.. సీఎం ఆదిత్యనాథ్‌తో కలిసి హనుమాన్ పూజలో పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com