రామమందిర భూమి పూజ సందర్భంగా ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

రామమందిర భూమి పూజ సందర్భంగా ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

రామమందిర నిర్మాణ భూమి పూజ నిర్వాహన జరిగిన సందర్భంగా ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు గతంలో ఉండేదని.. ఇప్పుడు ఉందని.. ఎప్పటికీ ఉంటుందని.. అన్నారు. ఎందుకంటే.. ఒక మసీదు స్థాపించబడితే అది శాశ్వతంగా మిగిలిపోతుందని ట్వీట్ చేశారు.

మరోవైపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఓ క్రిమినల్ గుంపు ధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ.. తాను బతికున్నంత కాలం బాబ్రీ మసీదు ఎపిసోడ్‌ ముగిసిపోదని హెచ్చరించారు. రామ మందిర భూమి పూజ నిర్వహించకూడదని విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story