తాకట్టు నుంచి పరాగ్‌ మిల్క్‌ షేర్ల విడుదల

తాకట్టు నుంచి పరాగ్‌ మిల్క్‌ షేర్ల విడుదల
X

రుణాలను చెల్లించి తాకట్టు నుంచి 27 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్‌ విడిపించినట్టు ఎక్స్ఛేంజీలకు పరాగ్‌ మిల్క్‌ సమాచారమిచ్చింది. కంపెనీ ప్రమోటర్‌ రూ.58.09 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించారని ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. తాజా రుణ చెల్లింపుతో కంపెనీ రుణం రూ.5.91 కోట్లకు పడిపోయింది.

తాజా అప్‌డేట్స్‌తో వరుసగా మూడోరోజూ పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ లాభాల్లో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో షేర్‌ రెండున్నర శాతం లాభపడి రూ.90.30కు చేరింది. ప్రస్తుతం అరశాతం పైగా లాభంతో రూ.88.75 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఇవాళ ఇప్పటి వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి దాదాపు 3.51 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

Tags

Next Story