భారీ వర్షాలు.. మునిగిన ముంబై

భారీ వర్షాలు.. మునిగిన ముంబై
X

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ముంబైతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాలు చిగురుటాకులా వణికాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షాల వల్ల రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ముంబైపై వర్ష ప్రభావం అధికంగా పడింది. కొన్ని చోట్ల పట్టాలు నీటమునగడంతో అత్యవసర సేవలు అందించే రైళ్ల రాకపోకలు నిలచిపోయాయి.

మరోవైపు భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ఆ ఇంట్లో ఉండే తల్లి, ఆమె పిల్లలు ఇద్దరు వరదలో కొట్టుకుపోయారు. ఈ ఘటన మంగళవారం సబర్బన్‌ శాంతాక్రుజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలియగానే రెండేళ్ల బాలికను కాపాడామని మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

Tags

Next Story