అంతర్జాతీయం

టిక్‌టాక్‌కు డెడ్ లైన్ విధించిన ట్రంప్

టిక్‌టాక్‌కు డెడ్ లైన్ విధించిన ట్రంప్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ ‘టిక్‌టాక్‌’ డెడ్‌లైన్ విధించారు. అమెరికాకు చెందిన ఏదైనా పెద్ద కంపెనీ సెప్టెంబర్ 15లోగా టిక్‌టాక్ కొనుగోలు చేయాలని అన్నారు. సెప్టెంబర్ 15 లోపు కొనుగోలు చేయకపోతే.. టిక్‌టాక్‌ను నిషేధిస్తామని అన్నారు. టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇస్తున్న‌ట్లు తెలిపారు.

అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ కావచ్చు... మరేదైనా సంస్థ కావచ్చు.. టిక్‌‌టాక్‌ను మాత్రం అమెరికా సంస్థ కొనుగోలు చేయాలని అన్నారు. అయితే, అయితే అది సురక్షితమైన అమెరికన్ సంస్థ అయి ఉండాలని అని ట్రంప్ పేర్కొన్నారు. భద్రతతో తమకు ఎటువంటి సమస్య ఉండకూడదన్నారు. అదేవిధంగా ఈ ఒప్పందం ద్వారా అమెరికా ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటున్న‌దని కూడా ట్రంప్‌ చెప్పారు.

కాగా.. ఇటీవల టిక్‌టాక్‌ను కొనుగోలు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story

RELATED STORIES