రైతులకు మద్దతుగా మాట్లాడితే చర్యలు తీసుకుంటున్నారు : ఓవి రమణ

రైతులకు మద్దతుగా మాట్లాడితే  చర్యలు తీసుకుంటున్నారు :   ఓవి రమణ
X

రైతులకు మద్దతుగా మాట్లాడితే పార్టీ పెద్దలు చర్యలు తీసుకుంటున్నారని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఓవి రమణ అన్నారు. అందరిని సస్పెండ్ చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరూ మిగలరని ఆయన అన్నారు. పార్టీలో ఆధిపత్య, వర్గపోరు ఉంటే పైస్థాయిలో చూసుకోవాలి కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మూడు రాధానుల విషయంలో ఓ పత్రికకు ఆర్టికల్ రాసినందుకు సస్పెండ్ చేస్తున్నట్టు తనకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారని అన్నారు. ఏపీలో అభివృద్ధి చెందే సమయంలో పార్టీని నాశనం చేసుకోవద్దని బీజేపీకి ఓవి రమణ సూచించారు.

Tags

Next Story