అసోంలో చెలరేగిన అల్లర్లు.. కర్ఫ్యూ విధించిన అధికారులు

అసోంలో చెలరేగిన అల్లర్లు.. కర్ఫ్యూ విధించిన అధికారులు

బుధవారం అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపుజ జరిగిన విషయం తెలిసిందే. అయితే, అసోంలో ఓ వర్గం భూమిపుజ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ అల్లర్లు అదుపు తప్పడంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ అల్లర్లులో ఓ కారు, మూడు మోటారు సైకిళ్లు దహనం అయ్యాయి. దీంతో సోనిట్‌పూర్ జిల్లాలో గోరుదుబా, భరాహింగోరి గ్రామాల్లో బుధవారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోనిట్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రకటించారు. అల్లర్లు అదుపు తప్పాయని.. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూ విధించామని.. ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కలెక్టరు ఆదేశించారు. అటు, గువాహటిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ కూడా 144 సెక్షన్ విధించారు. కొందరు ముస్కరులు శాంతి భద్రతలుకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందుకే 144 సెక్షన్ విధిస్తున్నామని.. ప్రజలంతా తమకు సహకరించాలని పోలీసులు కోరారు. ఎవరూ ర్యాలీలు తీయవద్దని.. నినాదాలు చేయవద్దని పోలీసులు కోరారు.

Tags

Next Story