దగ్గరే ఉన్నా.. దూరంగా ఉన్నట్టుంది: అమితాబ్
ఇంట్లో ఉన్నా జైల్లో ఉన్నట్టుంది.. అయిన వాళ్లంతా దగ్గరే ఉన్నా.. అందరూ దూరం ఉన్నట్లుంది అని అంటున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. మూడు వారాలపాటు నానావతి ఆసుపత్రిలో కరోనా వైరస్ కి చికిత్స పొంది బాలీవుడ్ బిగ్ బి ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న బచ్చన్ బుధవారం తన బ్లాగులో తన మనస్సులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో వాటిని అభిమానులతో పంచుకున్నారు. "మనస్సు మునుపెన్నడూ లేనంత ఎక్కువ వేగంతో పరిగెడుతోంది" అని రాశారు.
కుటుంబ అంతా దగ్గరే ఉన్నారు.. అయినా దూరంగా ఉన్న అనుభవం కలుగుతోంది. వారికీ.. నాకు గాజు తెర అడ్డుగా ఉందని రాసుకొచ్చారు. స్వంత ఇంటిలో ఏకాంతంగా ఉండాల్సిన పరిస్థితి.. వారు నన్ను సందర్శించే గంటలు జైలు జీవితాన్ని తలపిస్తోంది. వారితో మాటలు.. టెలిఫోన్లోనే సంభాషణలు.. రక్షా బంధన్ కి సంబంధించిన రాఖీలు అందాయని వాటిని తన చేతికి అలంకరించుకుని ఆ ఫోటోలను పోస్ట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com