ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజులో 10వేలకు పైగా పాజిటివ్ కేసులు..

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజులో 10వేలకు పైగా పాజిటివ్ కేసులు..

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24గంటల్లో 10,128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 77 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో వచ్చిన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య ఇరవై వేలు దాటింది. కాగా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.86 లక్షలు ఉంటే, మృతుల సంఖ్య 1,681కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడి కోలుకున్నవారు 1,04,354 మంది.. వివిధ ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్నవారు 80,426 మంది.

Tags

Read MoreRead Less
Next Story