జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. బీజేపీ నేత మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. బీజేపీ నేత మృతి

ఇటీవల సరిహద్దుల్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. తాజా జరిగిన కాల్పుల్లో జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా వెస్సు గ్రామంలో ఓ బీజేపీ సర్పంచ్ మృతి చెందాడు. గురువారం ఉదయం బీజేపీ సర్పంచ్ సజ్జాద్ అహ్మద్ ఖాండే ఇంటికి వచ్చి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అయితే, కాల్పులు జరిపిన వారు ఎవరు అనేది ఇంకా తెలియదు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story