అశోక్ గెహ్లాట్ సర్కారుకు ఊరట

ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను అధికార కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. దాఖలు చేసిన పిటిషన్ ను రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో గెహ్లాట్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా సచిన్ పైలట్ సహా 19 మంది రెబెల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అశోక్ గెహ్లాట్ సర్కారుకు అసెంబ్లీలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.. ఈ తరుణంలో గతంలో విలీనం అయిన బీఎస్పీ ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో గెహ్లాట్ సర్కారు మరింత ప్రశ్నార్ధకంలో పడింది. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో గెహ్లాట్ సర్కార్‌కు ఈ పరిణామం భారీ ఊరటగా భావిస్తున్నారు.
రామ్‌గంజ్‌మండి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మదన్ దిలావర్ బిఎస్‌పి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఆరు సీట్లు గెలుచుకుంది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఏడాది తరువాత అధికార కాంగ్రెస్‌లో చేరారు. వారు సందీప్ యాదవ్, వాజీబ్ అలీ, దీప్‌చంద్ ఖేరియా, లఖన్ మీనా, జోగేంద్ర అవానా, రాజేంద్ర గుధ. మరోవైపు రాజస్తాన్ అసెంబ్లీలో 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com