దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత
X

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా 15 రోజుల క్రితం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. 15 రోజుల క్రితం ఆయన కాలికి శస్త్ర చికిత్స జరిగింది. అది ఇన్ఫెక్షన్ కావడంతో పరిస్థితి విషమించి మరణించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ నకు చెందిన రామలింగారెడ్డి 2004,2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దొమ్మాట నియోజకవర్గం నుంచి తెరాస తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 2014,2018 సార్వత్రిక ఎన్నికలలోనూ గెలుపొందారు. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామలింగా రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags

Next Story