ట్రంప్ పోస్టులను తొలగించిన ఫేస్‌బుక్, ట్విట్టర్

కరోనా వైరస్ కు సంబంధించి తప్పుడు వార్తలను ట్రంప్ పోస్టు చేస్తున్నారని.. ఫేస్‌బుక్, ట్విట్టర్ చర్యలకు దిగాయి. ట్రంప్ చేసిన పోస్టులు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆ పోస్టులు తొలగించాయి. ట్రంప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్న పిల్లకు కరోనాను తట్టుకొనే రోగనిరోధక శక్తి ఉంటుందని చెప్పారు. ఈ వీడియో క్లిప్ ను ఫేస్‌బుక్, ట్విట్టర్ లో పోస్టు చేశారు. దీంతో ట్రంప్ చేసిన పోస్టులు నిబంధనలకు విరుద్థంగా ఉన్నాయని తొలగించారు.
ట్రంప్ చేసిన పోస్టులో ఓ వర్గానికి చెందిన వారి రోగ నిరోధక శక్తికి సంబంధించిన సమాచారం ఉందని.. అయితే, ఈ సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉందని ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు. ఇది తమ సంస్థ నిబంధనలకు విరుద్దంగా ఉందని తెలిపింది. అటు ట్విట్టర్ కూడా ఇదే విధంగా స్పందించింది. అయితే.. ట్విట్టర్, ఫేస్‌బుక్ సంస్థల చర్యలపై ట్రంప్ ప్రతినిధి కర్టనీ పారెల్లా స్పందించారు. ట్రంప్ పట్ల పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ట్రంప్ మాట్లాడింది వాస్తవమని, సామాజిక మాధ్యమ సంస్థలు న్యాయనిర్ణేతలు కారని తీవ్రంగా స్పందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com