పరుగులు పెడుతున్న పసిడి.. పది గ్రాముల ధర..

పరుగులు పెడుతున్న పసిడి.. పది గ్రాముల ధర..

రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నట్టే పసిడి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. పది గ్రాములు మేలిమి బంగారం ధర రూ.57,000 పైకి చేరుకుంటే, వెండి కిలో రూ.74,000 కు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల మందగమనమే పసిడి ధరల పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర బుధవారం సాయింత్రానికి 2038 డాలర్లు కాగా, వెండి ధర ఔన్సు 27 డాలర్ల వద్ద ట్రేడ్

అవుతోంది. ఈ సీజన్ లో పసిడి ఔన్సు ధర 2040 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెరికాతో సహా ఆర్థిక వ్యవస్థలన్నీ నెమ్మదించడం, కొవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏ దేశ కేంద్రీయ బ్యాంకు కూడా తన పసిడి నిల్వలను అమ్మకానికి పెట్టకపోవడంతో ధరల్లో తగ్గుదల కనిపించడం లేదని సమాచారం. అంతర్జాతీయ బంగారం ధరలతో పోలిస్తే దేశీయ మార్కెట్లో మరింత అధికంగా ఉంటున్నాయి. డాలర్ మారకం విలువ బంగారం ధరపై అధిక ప్రభావాన్ని చూపుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.50,000 స్థాయి కంటే పెరగడమే కాని ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story