మూడు, నాలుగు పొరలున్న మాస్కు.. 30 సార్లు ఉతుక్కుని వాడొచ్చు: ఐఐసీటీ

మూడు, నాలుగు పొరలున్న మాస్కు.. 30 సార్లు ఉతుక్కుని వాడొచ్చు: ఐఐసీటీ

ఇప్పుడు మన షాపింగ్ లో మాస్కులు మస్ట్ గా వచ్చి చేరాయి. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ మాస్కులు అమ్మేస్తున్నారు. అవి ఎంతవరకు వైరస్ ని కట్టడి చేస్తాయంటే.. అసలు లేనిదానికంటే ఏదో ఒకటి పెట్టుకోవడం మంచిదేగా అంటున్నారు. అదీ కొంత వరకు నిజమే.. తాజాగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కును తయారు చేశారు. మూడు, నాలుగు పొరలు కలిగి హైడ్రోఫోబిక్ పాలిమర్లతో బ్యాక్టీరియా, వైరస్ లను సమర్థంగా ఎదుర్కునేలా దీన్ని రూపొందించారు.

తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా వెలువడే తుంపర్లలో 0.3 మైక్రాన్ల పరిమాణం వరకు ఈ మాస్కు నిలువరిస్తుంది. గరిష్టంగా 60 నుంచి 70 శాతం వరకు వైరస్ ను అడ్డుకుంటుందని ఐఐసీటీ ప్రిన్సిపల్, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ సాన్స్ ఫేస్ మాస్క్ ను 30 సార్లు ఉతికి తిరికి వాడుకోవచ్చని.. రెండు మూడు నెలల వరకు పనికొస్తుందని తెలిపారు. ఈ మాస్కుల ఉత్పత్తికి అయ్యే వ్యయాన్ని భరించేందుకు సిప్లా ఫౌండేషన్ ముందుకు వచ్చిందని ఐఐసిటీ ప్రధాన శాస్త్రవేత్త శైలజ తెలిపారు.

Tags

Next Story