కీర్తి సురేష్ కి బంపరాఫర్.. శ్రీదేవి సీక్వెల్ లో..

కీర్తి సురేష్ కి బంపరాఫర్.. శ్రీదేవి సీక్వెల్ లో..

అందాల తార శ్రీదేవి నటించిన సినిమా ఎర్రగులాబీలు.. తమిళంలో, హిందీలో, తెలుగులో సూపర్ డూపర్ హిట్టైంది. తెలుగు, తమిళ్ లో కమల్ హాసన్ హీరోగా నటిస్తే, హిందీలో మాత్రం రాజేశ్ ఖన్నా నటించారు. ఇళయరాజ ఈ చిత్రానికి అందించిన సంగీత స్వరాలు 42 ఏళ్ల తరువాత కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటాయి. ఈ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి భారతీరాజా కుమారుడు మనోజ్ సన్నాహాలు చేస్తున్నారు. కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేయాలనుకుంటున్నారు.

నిర్మాతగా భారతీరాజా వ్యవహరిస్తున్న ఈ చిత్ర ఇతివృత్తం.. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలపైఓ యువతి ప్రతీకారం తీర్చుకునే కథ ఇది. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలను ఒక యువతి ప్రతీకారం తీర్చుకునే కథగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. మరి హీరోగా ఎవరు నటిస్తారు.. మిగిలిన తారాగణం వంటి విషయాలు తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story