మాల్యా కేసులలో ట్విస్ట్.. సుప్రీం కోర్టులో మాయమైన పత్రాలు

మాల్యా కేసులలో ట్విస్ట్.. సుప్రీం కోర్టులో మాయమైన పత్రాలు

విజయ మాల్యా కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మాల్యా కేసుకు సంబంధించిన పత్రాలు సుప్రీం కోర్టులో కనిపించడంలేదు. దీంతో మాల్యా కేసును ఈ నెల 20 వరకూ వాయిదా వేశారు. బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగవేశారని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు గత కొంత కాలంగా కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసులో విజ‌య్ మాల్యా రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే, తాజాగా ఈ కేసుకు సంబందించిన పత్రాలు అదృశ్యమైనట్టు ధర్మాసనం గుర్తించింది. త‌మ పిల్ల‌ల‌కు 40 మిలియ‌న్ల డాల‌ర్లు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన విష‌యంలో మాల్యా రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. పేప‌ర్లు క‌నిపించ‌కుండాపోవ‌డంతో క‌క్షిదారులు మ‌రింత స‌మ‌యం కోరారు.

Tags

Next Story