ఘనంగా మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడి వివాహం

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్ వివాహం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌ ఘనంగా జరిగింది. ఆగస్టు 5, బుధవారం రాత్రి 11గంటల 49 నిమిషాలకు ఈ వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో అతిథులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. వివాహం సందర్బంగా.. మంత్రి విశ్వరూప్‌ కుమారుడు వరుడు శ్రీకాంత్, వధువు వైష్ణవికి బంధువులు, అతిథులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, వైసీపీ నాయకులు హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story