మనోజ్ సిన్హాను ఎల్జీగా నియమించడంపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందన

మనోజ్ సిన్హాను ఎల్జీగా నియమించడంపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందన

జమ్మూకశ్మీర్ ఎల్జీగా మనోజ్ సిన్హాను కేంద్రప్రభుత్వం నియమించడంపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్జీగా మనోజ్ సిన్హాను నియమించడాన్ని తాను ఊహించలేదని ఆయన అన్నారు. గత రాత్రి ఒకట్రెండు పేర్లు వినిపించాయని.. అందులో మనోజ్ పేరు లేదని అన్నారు. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పటికీ నమ్మవచ్చని ఆయన అన్నారు. ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చిందని అన్నారు. కాగా.. మనోజ్ సిన్మాను ఎల్జీగా నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన నియామకంపై ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్జీగా ఉన్న గరీష్ చంద్ర రాజీనామా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story