తెలంగాణ సచివాలయం నిర్మణానికి రూ.400కోట్లు మంజూరు

తెలంగాణ సచివాలయం నిర్మణానికి రూ.400కోట్లు మంజూరు
X

తెలంగాణలో సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం‌ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నూతన సచివాలయ నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని ఆర్అండ్ బి శాఖా ద్వారా విడుదల చెయ్యాలని సూచించింది. ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

కాగా కొత్తగా నిర్మించబోయే సచివాలయం ప్రతి అంతస్తులో భోజనానికి సంబంధించి డైనింగ్‌ హాలు, సమావేశాల కోసం మీటింగ్‌ హాలు, సచివాలయ సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాల్,వాహనాలకు పార్కింగ్‌ వసతి ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

Tags

Next Story