ప్రధాని మోదీ ముందుగా 'హనుమ' ఆలయాన్ని దర్శించడానికి కారణం..
భారత దేశ ప్రధాని మోదీ అయోధ్య రామాలయ నిర్మాణాన్ని అత్యంత అట్టహాసంగా ప్రారంభించారు. ఆయన అయోధ్యలో అడుగుపెట్టిన మరుక్షణం ముందుగా హనుమంతుడి ఆలయాన్ని సందర్శించారు. ఆ తరువాతే అయోధ్య రామ మందిర భూమిపూజకు ఉపక్రమించారు. హనుమంతుడు రాముని భక్తుడు.. ప్రధాని మోదీ ముందుగా భక్తుని ఆలయాన్ని సందర్శించి ఏ ఆటంకమూ లేకుండా నీ దేవుడు.. మా రాముడి ఆలయాన్ని నిర్విగ్నంగా పూర్తి చేసేందుకు సహకరించవలెనని సాష్టాంగనమస్కారం చేసి మరీ వేడుకున్నారు. హనుమాన్ గఢీ ఆలయంలో 15 నిమిషాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీకి అక్కడి అర్చకులు ఆయనకు తలపాగా అందజేశారు.
మోదీ ముందుగా హనుమాన్ ఆలయానికి చేరుకోడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని అర్చకులు తెలిపారు. పురాణాల ప్రకారం రాముడి పరమభక్తుడైన హనుమ ఆశీర్వాదం లేకుండా ఏ పనీ పూర్తి కాదని చెప్పారు. రావణుడిని అంతమొందించిన తరువాత రాముడు అయోధ్యకు తిరుగుప్రయాణమయ్యాడు. ఆ సందర్భంలో హనుమ నివసించడానికి రాముడు ఆ ప్రాంతాన్ని ఆంజేనేయుడికి అప్పగించాడు. అందుకే ఆప్రాంతం హనుమాన్ గఢీ లేదా హనుమాన్ కోటగా ప్రసిద్ధికెక్కింది. అక్కడి నుంచే రామకోటను హనుమంతుడు పరిరక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఉత్తర భారతదేశ ప్రసిద్ధ ఆలయాల్లో హనుమానగఢీ ఒకటని పేర్కొన్నారు. ఈ దేవాలయ ప్రాంగణంలోనే హనుమంతుని తల్లి అంజనీదేవికి కూడా ఒక మందిరం ఉంది. ఈ మందిరంలో బాల హనుమ అమ్మ ఒడిలో కూర్చుని ఉంటారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com